దర్శక ధీరుడు రాజమౌళినే పోరా అంటూ అవమానించింది ఎవరు .. జక్కన్నక జీవితంలో మర్చిపోలేని ఘటన..!
వారసత్వంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టిన తన సొంత టాలెంట్‌తో దర్శకుడుగా ఎదిగారు జక్కన్న. అపజయం ఎరుగని దర్శకుడుగా కూడా ఆయన పేరు మీద రికార్డులో ఉన్నాయి . అలాంటి ఈ దర్శక దీరుడు కి కూడా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు జరిగాయి. అవును రాజమౌళి కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. అంతేకాకుండా ఇండస్ట్రీ జనాలతోనే కాకుండా బయట కూడా ఆయనకు అవమానం జరిగిందని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చారు. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి చిన్నప్పుడు చెన్నైలో ఎక్కువ ఉండేవారట. అయితే రోజు ఉదయం ఇంట్లో సామానం కోసం సూపర్ మార్కెట్ కు వెళ్లేవారట రాజమౌళి.
అయితే అప్పుడు అక్కడ అక్కడ బిల్ వేసే అతను ఏదో ఆలోచిస్తూ లెక్కలు వేస్తున్నారట .. అయితే తనకు కూడా అర్జెంట్ పని ఉండటంతో త్వరగా బిల్ వెయ్యాలని తమిళ్లో అడిగారట రాజమౌళి .. అలా నాలుగు ఐదు సార్లు అడిగేసరికి అవతలి వ్యక్తి పోరా అంటూ చిరాకు పడ్డారట. అంటే అక్కడ కాసేపు ఆగు అని అర్థం వచ్చేలా తమిళ్లో అతను అన్నారట. అప్పటివరకు తనను ఇంట్లో వాళ్ళు రారా అనడం తప్పించి బయట వారు ఎవరూ రా అనలేదు. దాంతో తనకు విపరీతమైన కోపం వచ్చిందని పెద్ద అయ్యక బాగా డబ్బులు సంపాదించి మనుషుల్ని పెట్టి అతన్ని కొట్టించాలని అనేంత కోపం వచ్చిందట.. రాజమౌళి ఇదే విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . రాజమౌళి ప్రస్తుత మహేష్ బాబు తో సినిమా చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు .. ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారు అనే విషయం పై క్లారిటీ లేదు కానీ .. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .