హోటల్‌లో నయనతారకు అవమానం...జనాలు ఛీ కొట్టారు?

Veldandi Saikiran
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దక్షిణాది ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తోంది అందాల ముద్దుగుమ్మ నయనతార. ఇక భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీనటులలో నయనతార ఒకరు. సినిమాలతో పాటు యాడ్స్ షూట్ లలో భారీగా డబ్బులను సంపాదిస్తోంది.

ఈ క్రమంలోనే నయనతార జీవిత కథ ఆధారంగా ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో తన ప్రేమ, పెళ్లి, సినిమాలు అన్నింటిని పొందుపరిచారు. కాగా, ఈ నెల 17న నయనతార పుట్టినరోజు తన కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో తన బర్త్ డేని చాలా సింపుల్గా జరుపుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఓ హోటల్ లో నయనతారకు ఘోర అవమానం ఎదురయింది.

ఢిల్లీలోని ఓ హోటల్ లో నయనతార, విగ్నేష్ కలిసి డిన్నర్ చేస్తుంటే చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు కూడా వారిని పట్టించుకోలేదు. నయనతార అంటే అక్కడి వారికి తెలియదా, తెలిసిన నైట్ తీసుకున్నారా, లేదంటే అదంతా అరేంజ్ చేసిన సెటప్ అన్నది మాత్రం తెలియడం లేదు. నార్త్ ఆడియన్స్ కి నయనతార అంటే తెలియదేమో అని అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సౌత్ లేడీ సూపర్ స్టార్ ని నార్త్ లో పట్టించుకోవడం లేదు ఏంటి అని అనుకుంటున్నారు. అంతేకాదు ఆ హోటల్ లో దాదాపు 30 నిమిషాలు నయనతార విగ్నేష్ క్యూలో నిలబడాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని విగ్నేష్ శివన్ ఇన్ స్టా వేదికగా వెల్లడించాడు. అరగంట పాటు వేయిట్ చేసిన అనంతరం టేబుల్ దొరికినట్లుగా చెప్పారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: