రాజమౌళి రికార్డులకే టెండర్ పెట్టిన పుష్ప గాడు .. కలెక్షల సునామీ ఏంటో చూపిస్తారుగా..!
ఇక పుష్ప సినిమాలో 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అనే సాంగ్ లోని లిరిక్స్ "ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనేతప్పొప్పులు తాగాలెట్టే నిప్పు నేనేనన్నైతే కొట్టేటోడు భూమిదే పుట్టలేదు .. ప్రస్తుతం అల్లు అర్జున్ కు ఇవి కరెక్ట్ గా సూట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో ఆయనపై ఎంత ట్రోలింగ్ నెగెటివిటీ జరుగుతున్న.. సినీ విశ్లేషకులకు నిర్మాతలకు మాత్రం పుష్పగాడి రేంజ్ ఏంటో అర్థం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ రైట్స్ అన్ని హిందీలో అనిల్ తదాని కొని భారీ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అలాగే ఈ సినిమాకి పోటిగా వస్తుందనుకున్న చావా మూవీ కూడా తప్పుకోవడంతో సోలో రిలీజ్ వచ్చింది. దీంతో ఈ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చిన దీంతో ఈ సినిమాకి హిందీలోనే 300 నుంచి 400 కోట్లు వస్తాయని అంటున్నారు.
హిట్ టాక్ వస్తే మన తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ మిగిలిన రాష్ట్రాల నుంచి 600 నుంచి 700 కోట్ల గ్రాస్ ఈజీగా వస్తుందిని అంటున్నారు. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే 1000 కోట్ల రికార్డు కొట్టడం చాలా సులభం. ఇక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఊచకోత అంటున్నారు. ఫాంటసీ , గ్రాఫిక్స్ లేని ఒక పక్క మాస్ కమర్షియల్ సినిమా ఇన్ని రికార్డులు క్రియేట్ చేయడం అంటే అంత సులభం కాదని పుష్ప మేనియా చూస్తుంటే ఇది సాధ్యమే అనిపిస్తుంది. ఇప్పటికే హిందీలో తెలుగులో పెద్ద సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో కసిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన దేవర సినిమా హిట్ అయిన ఆ డోస్ సరిపోలేదు అంటున్నారు అభిమానులు.. అంత కరెక్ట్ గా జరిగితే ఈ సినిమా 1000 కోట్ల మైలు దాటి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని కూడా అంటున్నారు. ఇక మరి పుష్ప గాడు రాజమౌళి రికార్డులను ఎంతవరకు బ్రేక్ చేస్తారో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.