జనవరిలో నందమూరి అభిమానులకు ఊహించిన అప్డేట్ .. బాలయ్య కల నెరవేరే ఛాన్స్..!
అయితే ఇప్పుడు ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే రాజకీయంగా చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి ఉంది. ఈ క్రమంలో ఈ సీనియర్ మోస్ట్ హీరోగా బాలయ్యకు తగిన పుష్కారం దక్కటం అన్నది అందరూ చాలాకాలంగా కోరుకుంటున్నారు. అది ఇప్పటికీ నెరవేరబోతుందని కూడా అంటున్నారు. ఇక పద్మ అవార్డుల సెలక్షన్ ప్రక్రియ నవంబర్లోనే ప్రారంభమైంది.. డిసెంబర్లో అది కొనసాగుతుంది జనవరి 26 రిపబ్లిక్ డే రోజున పద్మ అవార్డుల పేరు ప్రకటిస్తారు. ఈ విషయాలు ఇలా ఉంచితే తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి 2007లో పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు. గత సంవత్సరం దేశంలో రెండో అతిపెద్ద పౌర పుష్పారమైన పద్మ విభషున్ని కూడా ఆయన అందుకున్నారు.
ఆయనతో సమకాలీనుడు అయిన బాలయ్యకు కూడా పద్మ అవార్డులు ఇవ్వాలన్న డిమాండ్ గత ఏడాది నుంచి మొదలైంది. అది ఈ ఏడాది సాకారం కాబోంది అని అంటున్నారు. ఇక చూస్తే కనుక జనవరి 12న బాలయ్య నటించిన డాకూ మహరాజ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అది బాలయ్య అభిమానులకు ఒక గిఫ్ట్ అయితే అదే నెల 26న పద్మ అవార్డులలో బాలయ్య పేరు ఉంటుందని అంటున్నారు. మరి అది అసలైన పండుగ అని చెబుతున్నారు. మొత్తానికి కొత్త ఏడాది జనవరి వస్తూనే అటు బాలయ్యకు ఇటు అభిమానులకూ జాలీ మంత్ గా మారుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.