తెలుగు సినిమా రంగంలో చాలామంది స్నేహితులు ఉంటారు. హీరోలు సినిమాలపరంగా వారి మధ్య ఎంత పోటీ ఉన్నా.. స్నేహంలో చాలా స్పెషల్ గా నిలుస్తూ ఉంటారు. వాళ్లలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. గత నాలుగైదు సంవత్సరాలుగా వీరి మధ్య స్నేహం మరింత బలపడుతూ వస్తుంది. పైగా వీరిద్దరూ ముద్దుగా ఒకరినొకరు బావ, బావ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో వీరి స్నేహం చాలా స్ట్రాంగ్ అవుతుంది.ఇదిలా ఉంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యామిలీలు కలిసి ఇటీవల కాలంలో ఫ్యామిలీ ఫంక్షన్లు, ప్రవేట్ ఫంక్షన్లు కూడా చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇదిలావుంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలో పుష్ప1 సూపర్ హిట్ అవడంలో కీలక పాత్ర పోషించింది ఐటం సాంగ్. తిరిగి పుష్ప2లో కూడా దర్శకుడు సుకుమార్ ఐటంసాంగ్ ప్లాన్ చేసి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ చేత చేయిద్దామని చాలా ప్రయత్నించారు. అయితే శ్రద్ధ రూ.10 కోట్ల పారితోషికం అడగడంతో ఆమెతో చేయించాలనే ఆలోచన విరమించుకొని నాలుగు నిముషాల పాటను డాన్సింగ్ క్వీన్ గా పేరున్న శ్రీలల చేత చేయించారు.ఇదిలావుండగా స్త్రీ2 సినిమా ద్వారా రూ.650 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి టాప్ రేంజ్ లో ఉన్న శ్రద్ధాకపూర్ జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్2 సినిమాలో ఐటం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. ఈ సినిమాకు దర్శకుడు అయాన్ ముఖర్జీ. తారక్, హృతిక్, శ్రద్ధాకపూర్ చేత మంచి మాస్ స్టెప్పులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు బాగా ఫీలవుతున్నారు. తమ హీరోతో నటించకుండా తారక్ తో నటిస్తోందంటూ వాపోతున్నారు. బహుశా ఆమె అడిగినంత పారితోషికాన్ని వారు ఇచ్చివుంటారంటున్నారు.ఇక ప్రస్తుతం ధూమ్ 4లో రణబీర్ కపూర్ సరసన హీరోయిన్ గా శ్రద్ధ నటిస్తోంది. అలాగే మరో భారీ బడ్జెట్ మూవీ నాగిని చేస్తోంది. మరోవైపు తారక్ వార్ 2 షూటింగ్ పూర్తిచేసిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆగస్టు 14న వార్ 2 విడుదలవుతుంది.