ఏంటి తమిళ హీరో శివ కార్తికేయన్ తో కీర్తి సురేష్ ప్రేమలో పడిందా..ఆ జర్నలిస్టు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది.. తాజాగా పెళ్లి వార్తలు వినిపిస్తున్న కీర్తి సురేష్ పై ఇలాంటి రూమర్ ఏంటి అని ఈ విషయం తెలిసిన చాలా మంది షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ కీర్తి సురేష్ నిజంగానే శివ కార్తికేయన్ మాయలో పడిందా..వారిద్దరూ ప్రేమించుకున్నారా..అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. అమరన్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన శివ కార్తికేయన్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. అలాగే చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ కీర్తి సురేష్ కూడా తాజాగా వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ ఇద్దరు కలిసి వార్తల్లో నిలవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక అసలు విషయం ఏమిటంటే.. శివ కార్తికేయన్, కీర్తి సురేష్ కాంబినేషన్లో రెమో, రజినీ మురుగన్ వంటి సినిమాలు వచ్చాయి.. అయితే రెమో తర్వాత మళ్ళీ వీరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. దానికి కారణం వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణమే అని తెలుస్తుంది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్టు సబితా జోసెఫ్ మాట్లాడుతూ.. రెమో సినిమా షూటింగ్ సమయంలో శివ కార్తికేయన్ కీర్తి సురేష్ ఇద్దరు ప్రేమలో పడ్డారు.వీరిద్దరూ చాలా రోజులు డేటింగ్ చేశారు.
అయితే ఈ డేటింగ్ విషయం శివ కార్తికేయన్ ఇంట్లో తెలియడంతో రచ్చ జరిగింది. అయితే అప్పటికే పెళ్లైన శివ కార్తికేయన్ భార్య గొడవ పెట్టడంతో అది కాస్త తీవ్రంగా తయారయింది. దాంతో శివ కార్తికేయన్ కీర్తి సురేష్ ని దూరం పెట్టారు. ఇక అప్పటినుండి వీరి కాంబోలో మళ్ళీ ఒక్క సినిమా కూడా రాలేదు. అంటూ సబితా జోసెఫ్ సంచలన విషయాన్ని బయట పెట్టింది.దీంతో చాలా మంది నెటిజన్స్ నిజంగానే కీర్తి సురేష్ శివ కార్తికేయన్ లు డేటింగ్ చేశారా.. వీరిద్దరూ పెళ్లి వరకు వెళ్లారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.