ఎన్టీఆర్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ నటి.. ఆమె మాటలు వింటే ఎవరికైనా ఏడుపు ఆగదు..!
ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రెండు భాగాలుగా తీసుకురాబోతున్నాడు ఇక రెండో భాగంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ గురించి గతంలో దర్శకుడు కృష్ణవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ చేసిన పనికి సీనియర్ నటి సుహాసిని కన్నీళ్లు పట్టుకున్నారని ఆయన చెప్పాడు ఎన్టీఆర్ డైలాగ్స్ ఇరగదీస్తాడని అందరికీ తెలుసు .
ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఓ పని రాక్షసుడు ఎంత పెద్ద డైలాగు అయిన ఇట్టే ఆయన చెప్పేస్తాడు.. రాఖీ సినిమాలో క్లిమక్స్ డైలాగ్ ఇస్తే అన్న పదినిమిషాలు అన్నాడు. వచ్చాడు బోన్లో నిలబడి .. టక టక చెప్పేశాడు. తారక్ డైలాగ్ చెప్తుంటే సుహాసినిగారు అలా చూస్తూ ఉండిపోయారు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి. ఆమె వెంటనే పక్కకు వెళ్లి కళ్ళు తూడ్చుకున్నారు అని కృష్ణవంశీ అన్నరు. అబ్బా అంత మెమరీ ఉంది తారక్ కు.. ఆ తర్వాత అంత మెమరీ మహేష్ బాబు కు ఉంది అని కృష్ణవంశీ అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .