' దేవర ' ఏపీ - తెలంగాణ 2 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్... అప్పుడే బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా..!
మొదటి రోజు బెనిఫిట్ షోలో భారీ సంఖ్యలో పడ్డాయి దానికి తోడు టికెట్ రేట్స్ కూడా భారీగా పెంచేశారు. ఇక రెండో రోజు నుంచి తెలంగాణలో టికెట్ రేట్లు కాస్త తగ్గాయి. అందుకని రెండో రోజు కలెక్షన్ లో కూడా కొంత ఈ ఎఫెక్ట్ పడింది. కానీ ఎన్టీఆర్ రెండో రోజున కూడా మంచి కలెక్షన్ లే రాపెట్టాడు. ఏరియాల వారీగా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనేది చూస్తే.
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే.. నైజాం - 6. 94 కోట్లు వైజాగ్ - 1. 68 కోట్లు సీడెడ్ - 3. 77 కోట్లు ఈస్ట్ - 0. 86 లక్షలు వెస్ట్ - 0. 48 లక్షలు కృష్ణా - 0. 95 లక్షలు గుంటూర్ - 0. 82 లక్షలు నెల్లూర్ - 0.62 లక్షలు
'దేవర' సినిమాకు రెండో రోజు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వచ్చాయి. టికెట్ రేటు మీద జీఎస్టీ యాడ్ చేయకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 70.33 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ భారీ రికార్డ్స్ నమోదు చేసే దిశగా వెళుతోంది. మూడో రోజు కూడా అడ్వాన్స్డ్ బుకింగ్స్ బావున్నాయి. 'దేవర' మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బరిలో 172 కోట్ల రూపాయల షేర్ సాధించింది. హిందీలో మొదటి రోజు రూ. 7 కోట్ల నెట్ సాధించగా... రెండో రోజు 10 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. హిందీలో కలెక్షన్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి.