దేవర ఎవరి రెమ్యూనరేషన్ ఎంత.. కొర‌టాల గట్టిగానే లాగాడుగా..!

Amruth kumar
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ సెన్సేషన్ రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది.. ఇక ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.185 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
అదేవిధంగా ఈ సినిమాకు బడ్జెట్ ఎంత ఎవరి రెమ్యూనరేషన్ ఎంత అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇక దేవర‌ సినిమాకు మొత్తంగా రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకు ఇంత బడ్జెట్ అయిందా.. ఇందులో రెండో పార్ట్ బడ్జెట్ కూడా కలిపారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇక రెమ్యూనరేషన్ విషయానికొస్తే గ‌త‌ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచస్థాయి గుర్తింపును పొందిన తారక్ ఆ మూవీకి రూ. 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.. కానీ ‘దేవర’ కోసం రూ.60 కొట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
హీరోయిన్గా నటించిన జాన్నీ కపూర్ ఐదు కోట్లు, విల‌న్ గా చేసిన సైఫాలీ ఖాన్ 15 కోట్లు, ప్రకాష్ రాజ్ కోటిన్నర,  తీసుకున్నట్లు టాక్.. ఇక మిగిలిన క్యాస్ట్ విషయానికొస్తే వారి మామూల రెమ్యూనరేషన్  కంటే కాస్త ఎక్కువగానే తీసుకున్నారని కూడా అంటున్నారు. ఇక దర్శకుడు కొర‌టాల శివ కు ఎంత ఇచ్చారు ఆయనకు రెమ్యూనరేషన్  ఇచ్చారా లేదా లాభాల్లో వాటా ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే కొరటాల చివరి సినిమా ఆచార్య డిజాస్టర్ కావడంతో శివ రెమ్యూనరేషన్  ఎంత నది ఇంకా బయటికి రాలేదు.  కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ‘దేవర’ రెండో స్థానంలో ఉందని చెబుతున్నారు. వీకెండ్, దసరా హాలీడేస్ కలిసొచ్చాయి కాబట్టి.. టాక్ ఎలా ఉన్నా, బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: