ఓరి దేవుడా రామ్ చరణ్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎలా ఉందంటే... ఎవరు ఊహించరు..!?

Amruth kumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస‌ క్రేజీ సినిమాలతో మెగా బిరుదును సార్థకం చేసుకున్నాడు. మాస్‌, క్లాస్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చరణ్ రచ్చ, నాయ‌క్, ఎవడు, రంగస్థలం వంటి సినిమాలతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా గురించి ఎంత చెప్తున్నా తక్కువే. ఇక ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ శంకర్‌తో  గేమ్ ఛేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతున్నాడు. అదే విధంగా బుచ్చిబాబు డైరెక్షన్లో కూడా ఓ భారీ మూవీ చేస్తున్నాడు.

ఇదే క్రమంలో చరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ లో గోవిందుడు అందరివాడే కూడా ఒకటి సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కాజోల్ అగర్వాల్ నటించింది. అలాగే ఈ సినిమాలో చరణ్ చిల్లి పాత్రలో నటించిన అమ్మడు గుర్తుండే ఉంటుంది.. ఆమె ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ఆ అమ్మాయి పేరు అయేషా కాదుస్కర్.. ఈ సినిమాలో నటించింది ఆమె కాసేపై అయినా తన నటనతో బాగా ఆకట్టుకుంది.

చూడడానికి అచ్చ‌తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది.. కానీ ఈమెది ముంబై.. 2012లో వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ మూవీలో నటించిన ఆయేషా ఆ తర్వాత 2014లో టాలీవుడ్ లో గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ఈమె నటించలేదు. బాలీవుడ్ లో మాత్రం అప్పుడప్పుడు నటిస్తూ ఉండేది.ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జి అనే సినిమాలో కూడా నటించింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ మంచి ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను కవిస్తుంది. ప్ర‌స్తుతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌డానికి రేడీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: