బ‌న్నీ - కొర‌టాల శివ సినిమా ఎలా ఫిక్సైందో తెలుసా.. ఇదో విచిత్రం...!

Amruth kumar
- నాలుగు సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ అయిన కొర‌టాల శివ‌
- ఆచార్య డిజాస్ట‌ర్ తో ఒక్కసారిగా పాతాళంలో ప‌డిపోయిన వైనం
- ఎన్టీఆర్ దేవ‌ర తో బ్యాక్ బౌన్స్ అవుతాన‌న్న ధీమా .. ?
- త్వ‌ర‌లోనే బ‌న్నీ తో సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న‌

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

కొరటాల శివ టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడు . ఆచార్య సినిమాకు ముందు వరకు వరుసగా నాలుగు సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన కొరటాల శివ ఆచార్య సినిమా తో ఒకసారిగా పాతాళంలోకి పడిపోయాడు. ఆచార్య అంత కోలుకోలేని దెబ్బ కొట్టేసింది .. కొరటాల శివ కెరీర్ను .. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర లాంటి భారీ పాన్‌ హిట్ సినిమాను కొరటాల శివ తెర కెక్కిస్తున్నారు. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కొరటాల శివ అటు నార్త్ తో పాటు ఇటు తెలుగులో ప్రమోషన్లలో బిజీ బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర విషయాన్ని కొరటాల శివ మీడియాతో పంచుకున్నారు .

మిర్చి సినిమా రిలీజ్ అయ్యాక హీరో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతోను ... స్నేహితులతోనూ కలిసి సినిమా చూశారట. సినిమా విపరీతంగా నచ్చేసింది అందరికీ చూపిస్తూ కేరింతలు కొట్టారు .. ఆ తర్వాత బన్నీ కొర‌టాల శివ ను పిలిచి సినిమా చూశాను చాలా బాగుంది మనం తప్పకుండా కలిసి ఒక సినిమా చేద్దాం అని చెప్పారని .. అప్పటినుంచి తమ ఇద్దరం కలిసి సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం ... త్వరలోనే ఆరోజు వస్తుంది అని నమ్ముతున్నా .. అని దర్శకుడు కొరటాల చెప్పారు. దేవర సినిమా ప్రమోషన్లలో ఈ విషయాన్ని కొరటాల శివ షేర్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: