కొరటాల నయా స్కెచ్.. ఆ స్టార్ హీరోలతో బడ ప్లానింగ్..!

Amruth kumar
మన టాలీవుడ్‌ అగ్ర దర్శకులగా పేరు తెచ్చుకున్న వారిలో కొరటాల శివ కూడా ఒకరు.. ప్రభాస్‌తో చేసిన మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వటంతో ఇక శివకి తిరుగులేని స్టార్డం వచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాలకు ఆచార్యతో భారీ డిజాస్టర్ వచ్చి పడింది. అలా కొరటాల క్రేజ్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా ఓకే చేసిన అయ‌న కొరటాలకు నో చెప్పాడు. ఆచార్యతో స్లో అయిన కొరటాల మళ్ళీ దేవరతో కం బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.

ఎన్టీఆర్‌కు జనతా గ్యారేజ్ లాంటి బిగ్గెస్ట్ హిట్‌ ఇచ్చిన కొరటాల ఇప్పుడు దేవర‌ తో మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు ముందే కొత్త రికార్డులు క్రియేట్ చేసి బాక్సాఫీస్ పై కొత్త చరిత్ర సృష్టించటానికి రెడీగా ఉంది. ఆచార్య తర్వాత కొరటాల దేవరను ఎంతో కసిగా తెరకెక్కించి తానేంటో మరోసారి బాక్సాఫీస్ కి చూపించబోతున్నాడు. అయితే ఈ మూవీ తర్వాత కొరటాల ఎవరితో సినిమా చేయబోతున్నాడున్న ప్రశ్న అందరిలో ఆసక్తిగా మారింది. అయితే వెంటనే దేవర2 ఉంటుందా లేక ఎన్టీఆర్ చేస్తున్న వారు2, ప్రశాంత్ నీల్‌, సినిమాలయ్యాక దేవర‌2  తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

అయితే గతంలో అల్లు అర్జున్ కొరటాల కాంబోలో ఒక మూవీ రావాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆ మూవీపై ఎలాంటి అప్డేట్ రాలేదు. అంతేకాకుండా ప్రభాస్ తో కూడా కొరటాల ఓ మూవీ కమిట్ అయ్యాడని టాక్ కూడా ఉంది. అంతేకాకుండా ఎన్టీఆర్ దేవర2కి మరింత సమయం పెట్టి అవకాశం ఉంది కాబట్టి. ఈ లోపు కొరటాల శివ అల్లు అర్జున్ లేదా ప్రభాస్ లో ఒక్కరితో పక్కాగా సినిమా చేస్తాడు. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 కంప్లీట్ అయిన వెంటనే బన్నీ, కొరటాలతో సినిమా చేయడానికి ఓకే చెప్తున్నట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: