చిరంజీవి ఫస్ట్ లవ్ ఎవరూ అంటే? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
ఇక చిరు తన కెరీర్ లో ఎందరో అగ్ర హీరోయిన్లతో నటించాడు..జయసుధ, జయప్రద నుంచి నేటితరం తమన్నా, కాజల్ వంటి హీరోయిన్లతో కూడా చిరు ఆడి పాడాడు. అయితే ఇన్ని సంవత్సరాల తన సినీ కెరీర్లో ఆయనపై ఎఫైర్ రూమర్స్ వినిపించింది తక్కువే. అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి ఫస్ట్ లవ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే విషయాన్ని గతంలో చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.
అయితే తన ఫస్ట్ లవ్ ఎప్పుడు? ఎవరితోనో వెల్లడించాడు. ఆ ఇంటర్వ్యూలో చిరు తన మొదటి లవ్ గురించి ఆస్తికర విషయలు పంచుకున్నడు.. ''నా ఫస్ట్ లవ్ అంటే 7వ తరగతి చదివే రోజుల్లో. ఓ అమ్మాయి సైకిల్ తొక్కుతూ స్కూల్ కి వెళ్ళేది. ఆ రోజుల్లో మా మొగల్తూరులో అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మామూలు విషయం కాదు. ఆ అమ్మాయితో నాకు చనువు ఉండేది. నాకు సైకిల్ తొక్కడం రాదు. వచ్చు కానీ ఎక్స్పర్ట్ ని కాదు. నాకు కూడా సైకిల్ నేర్పుతావా? అని, ఆ అమ్మాయిని అడిగేవాడిని. ఆ అమ్మాయి నాకు సైకిల్ నేర్పేది. నేను సైకిల్ తొక్కుతుంటే.. అమ్మాయి వెనుక పట్టుకునేది. నేనేమో సైకిల్ తొక్కుతూ ముందు చూడకుండా.. వెనక్కి తిరిగి ఆ అమ్మాయి ముఖం చూడటానికి ప్రయత్నం చేసేవాడిని.. ఆ అమ్మాయి ముందు చూడు, అనేది. ఆమె పేరు చెప్పను కానీ.. తనే నా ఫస్ట్ లవ్'', అని చిరంజీవి తన రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.