నాని , అరుల్ మోహన్ హీరో , హీరోయిన్గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ మూవీని నిర్మించాడు. ఈ మూవీ ఆగస్టు 29 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లోనే ఈ సినిమా ఫార్ములాకు చాలా దగ్గరగా వచ్చింది. మరి ఈ సినిమాకు 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 8.72 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.54 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.31 కోట్లు , ఈస్ట్ లో 1.25 కోట్లు , వెస్ట్ లో 80 లక్షలు , గుంటూరులో 1.12 కోట్లు , కృష్ణ లో 1.19 కోట్లు , నెల్లూరు లో 74 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 4 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 18.67 కోట్ల షేర్ , 29.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 4 రోజుల్లో కర్ణాటక , తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 4.75 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 9.30 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 4 రోజులకు గాను ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 32.72 కోట్ల షేర్ , 59.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 9.28 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.