అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి పోయి వెళ్ళిపోయి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది.. ఇక ఈమె మరణించి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈమెకి సంబంధించిన గుర్తులు ఇంకా ఉన్నాయి.అవి ఎప్పటికీ చెరిగిపోవు కూడా.. సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు శ్రీదేవి పేరు వినిపిస్తుంది.అయితే అలాంటి శ్రీదేవిది ఈరోజు పుట్టినరోజు.ఆమె 1963 మే 13న జన్మించింది.అలా శ్రీదేవి మరణించినప్పటికీ దేశవ్యాప్తంగా ఆమె అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే అలాంటి శ్రీదేవికి బతికున్న సమయంలో ఓ కోరిక ఉండేదట. అయితే మరణించడం తో అది తీరని కోరికగా మారిపోయింది. మరి ఇంతకీ శ్రీదేవికి ఉన్న ఆ తీరని కోరిక ఏంటయ్యా అంటే.. ఆమెకు బ్లాక్ బస్టర్ మూవీస్ అయినా దేవదాసు సినిమాలో పార్వతి పాత్రలో అలాగే లైలా మజ్ను సినిమాలో లైలా పాత్రలో నటించాలనే కోరిక ఎక్కువగా ఉండదట.
అయితే ఇప్పటివరకు ఆమె దగ్గరికి అలాంటి పాత్రలు రాలేదట. ఇక ఇదే తన కోరిక అని బ్రతికున్న సమయంలో శ్రీదేవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది. అలాగే శ్రీదేవి తన చేతులారా వదులుకున్న ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఉందట.అదేంటంటే భారతిరాజా దర్శకత్వంలో వచ్చిన కిలెక్కే పోగుం రైలు.. అయితే ఈ సినిమా తెరకెక్కించే సమయంలో హీరోయిన్ గా మొదట అవకాశం శ్రీదేవికే వచ్చిందట. అయితే పాత్ర నచ్చి ఒప్పుకున్నప్పటికీ ఈ సినిమా 20 రోజులపాటు అవుట్డోర్ షూటింగ్ ఉంటుందని చెప్పారట.దాంతో వేరే సినిమాల్లో కూడా కమిట్మెంట్ ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కావు అనే ఉద్దేశంతో శ్రీదేవి ఆ సినిమాని మిస్ చేసుకోవాల్సి వచ్చిందట.
అయితే సినిమా వదులుకున్నందుకు మొదట్లో బాధపడినప్పటికీ తాను ఆ సినిమాలో నటించనందుకు మరో నటికి ఆ సినిమా ద్వారా అవకాశం వచ్చి ఆమె స్టార్ అయ్యింది అని సంతృప్తి పడిందట.ఇక ఆమె ఎవరో కాదు రాధిక. శ్రీదేవి ఆ సినిమా రిజెక్ట్ చేయడం కారణంగా రాధికను ఆ సినిమాలో తీసుకున్నారు.ఈ సినిమాతో రాధిక కి మంచి స్థానం లభించింది. అలా శ్రీదేవి ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు తను మాత్రమే కాదు తనతో పాటు అందరూ ఎదగాలని కోరుకునేది.అలా ఎంతో మంచి మనసున్న ఈ హీరోయిన్ 54 ఏళ్ల వయసులో దుబాయ్ కి పెళ్లి కోసం అని వెళ్లి బాత్ టబ్ లో పడి మరణించింది. తాజాగా ఈ హీరోయిన్ పుట్టినరోజు కావడంతో ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.