కొన్ని సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అంజలి , సమంత హీరోయిన్లుగా నటించగా ... ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. కొన్ని రోజుల క్రితం దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
దిల్ రాజు తాజాగా మాట్లాడుతూ ... శ్రీకాంత్ అడ్డాల ఒక రోజు నాకు సీతమ్మక్వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ను వినిపించాడు. నాకు అది అద్భుతంగా నచ్చింది. దానితో ఆయనను ఈ సినిమా కథ బాగుంది ఎవరితో చేయాలి అనుకుంటున్నావు అని అడిగాను. దానితో ఆయన అప్పటికే కొత్త బంగారు లోకం సినిమా అంతా కొత్త వాళ్ళతో చేసి ఉండడంతో ఈ సినిమాను కూడా అలాగే అంతా కొత్త వాళ్ళతో చేయాలి అనుకుంటున్నట్లుగా చెప్పాడు. దానితో నేను ఈ సినిమా అంతా కొత్త వాళ్ళతో అయితే సెట్ కాదు. ఈ కథ లో స్టార్ హీరోలు ఉంటే బాగుంటుంది అని అన్నాను. దానితో ఆయన వెంకటేష్ గారు ఈ మూవీ కథను విన్నారు. నాతో టచ్ లో ఉన్నారు.
ఆయన ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పాడు. ఇక ఆ తర్వాత పవన్ లాంటి హీరోను ఈ సినిమాలో మరో హీరోగా తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచన నేను వ్యక్తం చేశాను. ఇక ఆ తర్వాత అనుకోకుండా నేను ఒక రోజు మహేష్ బాబును కలవడం , ఈ సినిమా కథను చెప్పడం , ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలా అంతా కొత్త వాళ్ళతో చేయాలి అని శ్రీకాంత్ అడ్డాల అనుకున్న చివరకు ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోస్ వచ్చినట్లు రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశాడు.