షాక్: షూటింగ్లో గాయపడ్డ ప్రియాంక చోప్రా.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Divya
బాలీవుడ్ హాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ ప్రియాంక చోప్రా అందరికీ సుపరిచితమే.. ఒకపక్క వెబ్ సిరీస్లో మరొక పక్క సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీ లైఫ్ ను గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ప్రియాంక చోప్రా నటిస్తున్న ఒక హాలీవుడ్ మూవీ బ్లఫ్ సినిమా షూటింగ్ సమయంలో ఈమెకు ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రియాంక చోప్రా కు స్వల్ప గాయాలైనట్లుగా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

ముఖ్యంగా ప్రియాంక చోప్రా గొంతుకు గాయమైనట్లుగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలలో తెలియజేసింది. అలాగే గాయాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది. ఈరోజు ఉదయం తన ఇన్స్టాలో ఇలా వరుస అప్డేట్లను సైతం షేర్ చేసింది.. ది బ్లఫ్ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ప్రమాదం జరిగిందని వెల్లడించింది. ఈ క్రమంలోనే గొంతు కింద గాయమైనట్లుగా తెలుపుతూ ఫోటోలు షేర్ చేయక దీంతో అభిమానులు సైతం కాస్త ఆందోళన పడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

బ్లఫ్ చిత్రాన్ని ఫ్రాంక్ ఈ ఫ్లవర్ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్తో కలిసి ఈ చిత్రాన్ని రసో బ్రదర్స్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు.ఆసక్తికరంగా థ్రిల్లింగ్ అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నది. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో నటించలేదు. ముఖ్యంగా ప్రముఖ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకొని లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యారు. ఇప్పటికే సీటడేల్ వెబ్ సిరీస్ ద్వారా నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: