వద్దనుకుంటూనే.. మళ్లీ ఆ హీరోకే కమిటైన సమంత?

praveen
దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వస్తుంది సమంత. అయితే అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమ పెళ్లి చేసుకుంది. కానీ ఎంతో కాలం పాటు వీరి దాంపత్య బంధం నిలువలేదు. మధ్యలోనే విడాకులు తీసుకుని వేరుపడ్డారు. అయితే ఇలా విడాకుల తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది సమంత. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు.. వెబ్ సిరీస్ లు చేస్తూ ఉంది అని చెప్పాలి.

 అంతలోనే మయోసైటీస్ అనే మాయదారి వ్యాధి బారినబడిన సమంత కెరీర్ కి కొంతకాలం పాటు బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ వ్యాధి నుంచి అతి కష్టం మీద కోలుకున్న ఈ హీరోయిన్.. మళ్లీ కెరియర్ పై దృష్టి సారించింది. రీ ఎంట్రీ  ఇచ్చేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే రీ ఎంట్రీ లో  అటు తెలుగులో సినిమాల చేయకూడదని సమంత డిసైడ్ అయింది అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అంతలోనే ఒక తెలుగు హీరో సినిమా ఆఫర్ రావడం తప్పనిసరి పరిస్థితుల్లో సమంత ఈ సినిమాను ఓకే చేయడం జరిగిపోయింది అంటూ మరో వార్త తెరమీదకి వచ్చింది.

 ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఇప్పటివరకు ఎంతోమంది అగ్ర హీరోలతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ తో రొమాన్స్ చేయబోతుందట. ఏకంగా ఈ యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుందట. ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా వర్క్ చేస్తుండగా.. నాగవంశీ - త్రివిక్రమ్ భార్య సౌజన్య సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్న రిజెక్ట్ చేసి సిద్దు జొన్నలగడ్డ సినిమాకు సమంత ఎందుకు ఓకే చెప్పింది అంటూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: