రష్మిక ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

Divya
ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో రష్మిక కూడా ముందు వరుసలో ఉన్నది.. అందం అభినయంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది రష్మిక.. పుష్ప, యానిమల్ చిత్రాలతో సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది.. ఈ రోజున రష్మిక పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు సైతం నాన్న రచ్చ చేస్తున్నారు. రష్మిక నటిస్తున్న సినిమాల అప్డేట్ గురించి రివీల్ చేస్తూ ఉన్నారు మేకర్స్.. ఇదంతా ఇలా ఉంటే రష్మిక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నది..

ఈ క్రమంలోనే రష్మిక పర్సనల్ విషయానికి వస్తే ఆమె ఆస్తులు ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి అభిమానులు నెటిజెన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. 1995లో జన్మించిన రష్మిక మొదటిసారి కిరాక్ పార్టీ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలలో కూడా నటించింది.. రష్మిక ఆస్తి విషయానికి వస్తే సుమారుగా రూ .50 కోట్లకు పైగా ఉంటుందట.. ప్రతినెల రూ .60 లక్షల రూపాయల వరకు రష్మిక సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సంవత్సరానికి ఆదాయం రూ.8.5 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుని టాప్-10 హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు.. ఒక్కో చిత్రానికి దాదాపుగా రూ.5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. పుష్ప-2 సినిమా తర్వాత రెమ్యూనరేషన్ మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాలలో కూడా ఇల్లు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ ,ముంబై ,గోవా, కూర్గ్ ఇతరత్న ప్రాంతాలలో కూడా సొంత ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది.. రష్మికకు కార్లు అంటే చాలా ఇష్టం అందుకే ఈమె దగ్గర పలు ఖరీదైన కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మికకు సంబంధించి ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: