"స్వయంభు" మూవీలో నిఖిల్ కి జోడిగా మరో క్రేజీ బ్యూటీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటుల లో నిఖిల్ ఒకరు . ఈయన హ్యాపీ డేస్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఈయన పలు సినిమాలలో నటించినప్పటికి ఆ మూవీ లు ఈయన కు పెద్దగా గుర్తింపుని తెచ్చి పెట్టలేదు . అలాంటి సమయం లోనే ఈయన స్వామి రారా అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయన తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.


ఆ తర్వాత నుండి ఈయన రొటీన్ సినిమాలు చేయకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వాటితో మంచి విజయాలను అందుకుంటు మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు . ఇక పోతే ఈయన కొంత కాలం క్రితం "కార్తికేయ 2" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ తో నిఖిల్ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు కూడా లభించింది. ఇకపోతే ఆ తర్వాత నిఖిల్ "స్పై" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మాత్రం ఈ నటుడుకి నిరాశనే మిగుల్చింది.


ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ "స్వయంభు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను భువన్‌ , శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ లో సంయుక్త తో పాటు మరో ముద్దు గుమ్మ కూడా హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ నబా నటేష్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: