పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. OG రిలీజ్ డేట్ వచ్చేసింది..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఓజీ. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ జి సినిమాతో పాటు మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఆ సినిమాల్లో మొదటిగా వస్తున్న సినిమా ఓజి. నిజానికి ఈ సినిమా గత ఏడాది విడుదల కావలసి ఉంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగ్ కి రాలేదు. అందుకే వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఇప్పుడు కేవలం 15 రోజులు డేట్స్ ఇస్తే చాలు షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అని అంటున్నారు. 


కానీ మన పవర్ స్టార్ కి మాత్రం డేట్స్ కుదరట్లేదు అని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఏపీ ఎన్నికలు అయ్యేంతవరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో కనిపించే అవకాశం లేదు. దీంతో ఆయనతో సినిమా చేయడానికి కమిట్ అయిన దర్శకులు ఇతర సినిమాలో చేసే పనిలో పని పడ్డారు. హరీష్‌ శంకర్‌ ఇప్పటికే రవితేజ తో మిస్టర్‌ బచ్చన్‌ మూవీ చేస్తున్నారు. మరోవైపు ఓజీ ఫేమ్‌ సుజీత్‌ కూడా మరో సినిమాకి కమిట్‌ అయ్యారట. కానీ ఓజీ తర్వాతే అది ఉంటుందని సమాచారం. తాజాగా ఓజీ నుంచి అదిరిపోయే అప్‌డేట్లు వచ్చాయి. రిలీజ్‌ డేట్‌ క్లారిటీ వచ్చింది.


తాజాగా ఫిల్మ్ నగర్‌ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ రిలజీ్‌ డేట్‌ని లాక్‌ చేసిందట యూనిట్‌. సెప్టెంబర్‌లో విడుదల తేదీని ఫిక్స్ చేసిందట. సెప్టెంబర్‌ 27న రాబోతున్నట్టు తెలుస్తుంది. లాంగ్‌ వీకెండ్‌ ఉన్న నేపథ్యంలో ఈ డేట్‌ని ఫిక్స్ చేశారట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉండబోతుందని తెలుస్తుంది. ఏపీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ మూవీని కంప్లీట్‌ చేసి రిలీజ్‌ చేయాలని టీమ్‌ భావిస్తుంది. ఉంటే ముందుగా సెప్టెంబర్‌ 27న రామ్‌ చరణ్‌ నటించిన గేమ్‌ ఛేంజర్‌ మూవీ వస్తుందని భావించారు. నిర్మాత దిల్‌ రాజు కూడా సెప్టెంబర్‌లో వస్తున్నట్టు చెప్పారు. కానీ ఈ డేట్‌కి బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ మూవీని ఫిక్స్ చేశారు. దీంతో అబ్బాయి రామ్‌చరణ్‌కి ఇది పెద్ద షాక్‌ అని అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: