సంక్రాంతి నుండి మార్చ్ కి షిఫ్ట్ అయిన ఫ్యామిలీ స్టార్.. ఎందుకంటే..!?

Anilkumar
ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. విజయ్ కి గీతాగోవిందం రూపంలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించిన పరశురాం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. సక్సెస్ ఫుల్ కాంబో రిపీట్ అవుతుండడం, దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తుండడంతో 'ఫ్యామిలీ స్టార్' పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది.


ఇటీవల ఓ షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లాల్సిన మూవీ యూనిట్ కి వీసా సమస్యలు ఎదురవడంతో షూటింగ్ ఆలస్యం అయింది. దానికి తోడు సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండడంతో మూవీ టీం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, నాగార్జున నా సామి రంగా, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధవ్ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ పోటీలో తమ సినిమాని రిలీజ్ చేస్తే కరెక్ట్ కాదని నిర్మాతలు భావించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న


ఈ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకొని వచ్చే ఏడాది మార్చ్ కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ ఫిలింనగర్ రిపోర్ట్ ప్రకారం 'ఫ్యామిలీ స్టార్' మూవీ వచ్చే ఏడాది మార్చి 22న థియేటర్స్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే న్యూ రిలీజ్ డేట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కి జోడిగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: