పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రభాస్ ను తన అభిమానులంతా ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులకు పూనకాలే అని చెప్పాలి. ఇకపోతే ప్రభాస్ నటించిన చత్రపతి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చత్రపతి సినిమా మరోసారి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
ఈనెల 23న దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2005లో విడుదల అయింది. దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమాని మరొకసారి విడుదల చేస్తున్నారు అన్న వార్తను విని డార్లింగ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ కి ఈ సినిమాతోనే స్టార్ హీరోగా గుర్తింపు మరింత ఎక్కువైంది అని చెప్పడంలో
ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 23న ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు దీనిని 4 కే వెర్షన్ లో విడుదల చేయాలని సన్నాహాలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి బుకింగ్లను కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట. ప్రభాస్ శ్రియ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో భానుప్రియ ప్రదీప్ రావత్ కోట శ్రీనివాసరావు జై ప్రకాష్ రెడ్డి వంటి వారు కొన్ని కీలక పాత్రల్లో నటించారు. ఏం ఏం కీరవాణి అందించగా బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.