నేను అలాంటి దాన్ని కాదు.. నిర్మాతలకు చెప్పేస్తున్న మృణాల్ ఠాగూర్?
సీతారామం సినిమాలో సీత పాత్రలో మృణాల ఠాగూర్ ను చూసిన ప్రేక్షకులందరూ కూడా స్వర్గం నుంచి భూమి మీదకు వచ్చిన అతిలోకసుందరి ఏమో అని అనుకున్నారు అనడంలోనూ సందేహం లేదు. సీతారామం తర్వాత ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు వెబ్ సిరీస్లలో బోల్డ్ పాత్రలు చేస్తూ కూడా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. అయితే మృనాల్ ఠాగూర్ పారితోషకం అమాంతం పెంచేసింది అంటూ ఒక వార్తా గత కొన్ని రోజుల నుంచి వైరల్ గా మారిపోయింది.
పారితోషకం పెంచడంలో తప్పేముంది అని అంటారా.. అయితే నిర్మాతల ఆలోచనకు కూడా అందనంత ఎక్కువగా పారితోషకం పెంచిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమే మృనాల్ ఠాగూర్ కి ఇబ్బందిగా మారిందట. దీంతో తన మేనేజర్ ద్వారా నిర్మాతలకు సమాచారం ఇస్తుందట. తానేమి రెమ్యూనిరేషన్ పెంచేయలేదని అందరికీ చెబుతుందట. పారితోషకం పెంచింది అన్న వార్తలతో ఆమెకు ఒక ఆఫర్ కూడా మిస్ అయిందట. ఈ విషయం ఆమె దృష్టికి వెళ్లడంతో ఇక జాగ్రత్త పడటం మొదలుపెట్టిందట మృణాలో. అయితే సార్డమ్ వస్తే రెమ్యూనరేషన్ గాసిప్స్ రావడం మామూలే కానీ.. మరి ఇంత దారుణంగానా అని మనాల్ ఠాగూర్ గాసిప్స్ పై ఎంతగానో బాధపడుతుందట. తాను అలా రెమ్యూనరేషన్ పెంచే వ్యక్తిని కాదు అని ఇక మేనేజర్ ద్వారా నిర్మాతలకు చెప్పిస్తుందట.