KH -233 సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ లో కమలహాసన్.. వీడియో వైరల్..!!

Divya
విక్రమ్ మూవీతో కం బ్యాక్ ఇచ్చిన కమలహాసన్ వరుస పెట్టి ప్రస్తుతం సినిమాలను అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు.. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదలుపెట్టి దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయలేదు.. ఇందులో కాజల్ అగర్వాల్ ,రకుల్ ప్రీతిసింగ్ నటిస్తూ ఉన్నారు. అలాగే ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీలో విలన్ గా నటిస్తూ ఉన్నారు. అలాగే తమిళ డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వంలో తన 233 వ సినిమా అని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కాగా డైరెక్టర్ వినోద్ గతంలో ఖాకీ ,వాలిమై ,తెగింపు వంటి యాక్షన్ చిత్రాలను సైతం  తెరకెక్కించారు. ఇప్పుడు కూడా కమలహాసన్ తో అలాంటి ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ భాగంగా కమలహాసన్ మిషన్ గన్నుతో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈ వీడియోతో ఈ సినిమా పైన అంచనాలను మరింత పెంచేస్తున్నారు.

విక్రమ్ సినిమాలో కమలహాసన్ మిషన్ గన్నుతో చేసిన యాక్సిడెంట్ సన్నివేశం ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది ఇప్పుడు ఈ మూవీలో కూడా ఆ రేంజ్ లో సీన్స్ ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ బ్యానర్ పైన ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఈ చిత్రానికి రైస్ టు రోల్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం ఇక ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల వ్యవహారం గురించి త్వరలోనే చిత్ర బృందం తెలియజేయాల్సి ఉన్నది.. ఇండియన్-2 సినిమా షూటింగ్ పూర్తి అయినది తర్వాతే ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది మరి త్వరలోనే ఇండియన్-2 సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: