కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ ని ఇండస్ట్రీకి వచ్చి వివిధ భాషల్లో అన్ని సినిమాల్లో అవకాశాలు కొట్టేసి ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉంది రష్మిక మందన. కెరియర్ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం రష్మిక తెలుగు తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ కెరియర్ పరంగా చాలా బిజీ బిజీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోని రష్మిక మందన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వల్ల ఆమె ఇబ్బందుల్లోకి పడుతుంది అన్న వార్తలు వినబడుతున్నాయి. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి సినిమాల్లో నటించిన రష్మిక మందన
ఒక సినిమా కూడా మంచి హిట్ అందుకోలేకపోయింది. ఇలా బాలీవుడ్ సినిమాలు సరైన సక్సెస్ అందుకోలేక పోయినప్పటికీ బాలీవుడ్ పైనే చాలా ఆసక్తి చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. కాగా ఈ సినిమాలో తనకి అవకాశం రావడంతో తెలుగులో నితిన్ హీరోగా మరియు వెంకి కుడుములు దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమాని రిజెక్ట్ చేసింది. ఇలా బాలీవుడ్ సినిమా మరియు నితిన్ సినిమా ఒకేసారి షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలోని డేట్స్
అడ్జస్ట్ కాక రష్మిక టాలీవుడ్ సినిమాల కన్నా బాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రష్మిక మందన వెంకీ కుడుముల కాంబినేషన్ లో రావలసిన సినిమా నుండి తప్పుకోవడంతో రష్మిక స్థానాన్ని నటి శ్రీ లీల కొట్టేసిందని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో షాహిద్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా బడ్జెట్ సమస్యల కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దీంతో రష్మికకు భారీగా షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే ఇటు నితిన్ సినిమాను వదులుకోగా అటు బాలీవుడ్ సినిమా సైతం ఆగిపోయింది. దీంతో ఒకేసారి రెండు అవకాశాలను కోల్పోయింది రష్మిక మందన..!!