టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగిన హీరోయిన్లలో కావ్య కళ్యాణ్‌రామ్ కూడా ఒకరు. ఇండస్ట్రీకి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి సందడి చేసిన ఈమె మసూద సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. అనంతరం బలగం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈ సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా ఈ సినిమా ద్వారా ఎంత మంచిని గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ సినిమా తర్వాత తనకి వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు అమ్మాయిగా సినీ ఇండస్ట్రీకి సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలోనే కావ్య కళ్యాణ్ రాము ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఇంటర్వ్యూలో భాగంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్న నాగచైతన్య గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలను చేసింది. ఇక దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య తన క్రష్ అని ఈ సందర్భంగా పేర్కొంది కావ్య కళ్యాణ్ రామ్. నాగ చైతన్యత సినిమాలో నటించే అవకాశం వస్తే కచ్చితంగా ఏమాత్రం ఆలోచించకుండా సినిమా ఓకే చేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేసింది.
నాగచైతన్య అంటే తనకు చాలా ఇష్టమని అతనితో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఆమె తెలియజేసింది . తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తన ముద్దు పేరు అమ్ము అని బిటెక్ పూర్తి చేశాను అని.. దానితోపాటు డిస్టిక్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ అని ఈ సందర్భంగా తన గురించి తెలియని విషయాలను పంచుకుంది. దీంతో నాగచైతన్య అంటే తనకి ఇష్టం అని ఆమె తెలియజేయడంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!