ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు నాచురల్ స్టార్ నాని. సొంతంగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఒక చిరంజీవి రవితేజ లాగా నాని కూడా ఎందరికో ఆదర్శమని ఇప్పుడున్న చాలామంది యంగ్ హీరోలు చెప్పకనే చెప్తారు. కానీ అప్పుడప్పుడు నాని చేసే కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ గురించి నాని గతంలో చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మరొకసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నాని.
తాజాగా దుల్కర్ సన్మాన హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోట సినిమా ఆగస్టు 24న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో ఘనంగా జరిపారు చిత్ర బృందం. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దగ్గుపాటి రానా మరియు హీరో నాని ఇద్దరు రావడం జరిగింది. కాగా ఇదే వేదికపై నాని పాన్ ఇండియా స్టార్ హీరోల గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ అని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ మనమందరం పాన్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు ఎందుకో పాన్ ఇండియా అనే పదం అసలు నచ్చదు.. నాకు తెలిసిన యాక్టర్స్లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారు
అంటే అది దుల్కర్ మాత్రమే అని నేను చెప్తాను.. అతని కోసం హిందీ డైరెక్టర్ స్టోరీ రాసుకుంటారు.. తెలుగు డైరెక్టర్ స్టోరీ రాస్తాడు.. ఓ తమిళ దర్శ కుడు మలయాళ దర్శకుడు ఇలా అన్నీ ఇండస్ట్రీలో ఆయన కోసం స్టోరీలు రాసుకునే దర్శకులు ఎందరో ఉన్నారు.. పాన్ ఇండియా యాక్టర్ కి నిజమైన నిర్వచనం అంటే ఇదే.. అంటూ నాని తన మాటల్లో చెప్పడం జరిగింది. దీంతో టాలీవుడ్ లో మిగతా హీరోల ఫ్యాన్స్ నాని పై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. నాని ఎప్పటికీ పాన్ ఇండియా హీరో కాలేడు కాబట్టి ఆ పదం నచ్చలేదు అని ఈ సందర్భంగా చెప్పాడు అని అంటున్నారు. దుల్కర్ మంచి నటుడే కావచ్చు కానీ ఇండియా స్టార్ అయ్యే మెటీరియల్ కాదు అని ఈ సందర్భంగా వారిపై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు..!!