భర్తతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన కాజల్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. తెలుగు తమిళ భాషల్లో దాదాపుగా స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది కాజల్. కెరీర్ బిగినింగ్ నుండి ఇప్పటివరకు తన గ్రాఫ్ ని పెంచుకుంటూ పోయింది. అంతేకాదు టాలీవుడ్ లో ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్గా కూడా నిలిచింది కాజల్. కమర్షియల్ సినిమాలతో కాజల్ తిరుగులేని స్టార్ డంని సొంతం చేసుకుంది. ఇక వివాహం తరువాత కూడా మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతోంది కాజల్. మొత్తంగా సక్సెస్ గ్రాఫ్ తో వెళ్తోంది .


అయితే 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుంది కాజల్. ఇక వివాహం తరువాత వీరిద్దరూ తరచూ వెకేషన్స్ కి వెళుతున్న మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గత ఏడాది ఈ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ప్రస్తుతం తన ముద్దుల కొడుకుతో తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది కాజల్. తరచుగా తన భర్త కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే గత ఏడాది తను ప్రెగ్నెంట్ అయిన కారణంగా సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్ తిరిగి మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది.


ప్రస్తుతం కాజల్ కమలహాసన్ సరసన ఇండియన్ టు లో నటిస్తోంది. అయితే తాజాగా తన భర్త కిచ్లు తో కలిసి ఒక రొమాంటిక్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది ఆమె. వారిద్దరూ సముద్రంలో బోటింగ్ చేస్తూ రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. అయితే ఈ ఫోజుల్లో కాజల్ నిజంగానే చందమామ లాగా వెలిగిపోతుందని అంటున్నారు వీరిద్దరి ఫోటోలు చూసిన చాలామంది. మైండ్ బ్లాక్ అయ్యే విధంగా వీరిద్దరూ ఫోటోలకి ఫోజులిస్తున్నారు. ఇక ఇండియన్ టు సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది కాజల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: