మరో సారి మంచి మనసు చాటుకున్న మాస్ మహారాజ..ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. !?

Anilkumar
ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎదిగిన మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఒకప్పుడు సైడ్ రోల్స్ చేస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించేవాడు రవితేజ. అయితే ఇప్పుడు హీరోగా ఫుల్ బిజీ అయ్యాడు .ప్రస్తుతం హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రవితేజ  నటించిన చివరి సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు .దాంతో ఆయన నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలను లైన్లో పెడుతూ ముందుగా ధమాకా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


  ఇక త్రినాధ రావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా  త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా  ఉంది .అయితే తాజాగా రవితేజ చేసిన పనికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలను అందుకుంటున్నాడు. అయితే మాస్ మహారాజా మంచి మనసుకు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా మాస్ మహారాజ రవితేజ ధమాకా ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో ఫోటో దిగారు. దీంతో ఎంతో ఎనర్జీగా కనిపించే రవితేజ అభిమానులతో చాలా ఆప్యంగా మాట్లాడారు. 


అక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోటోలు ఇచ్చారు. 
అలాగే అక్కడికి వచ్చిన ఒక మహిళ అభిమానిని స్టేజ్ పైన రవితేజ కాళ్లకు నమస్కరించబోయింది. ఇంతలో ఆయన అమ్మమ్మ వద్దంటూ రిక్వెస్ట్ చేశారు. వికలాంగుడైన ఓ అభిమాని చేతి కర్ర ని ఆయన పట్టుకొని ఫోటోలు దిగారు రవితేజ. అంతేకాదు చిన్న పిల్లలతో కూడా ఫోటోలను దిగారు. అలాగే దర్శకుడు బాబి కూడా రవితేజతో ఫోటో దిగారు దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా కదా మారింది..!!





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: