పవన్ కళ్యాణ్ ను హ్యాష్ ట్యాగ్ తో వైరల్ చేస్తున్న అభిమానులు.. అందుకేనా..?

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా అంతే వేగంగా దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో రీమేక్ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇది ఇప్పటిది కాదు.. గతంలో కూడా ఏ భాషలో అయినా సరే సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందంటే ఆ సినిమాను రీమేక్ చేయడానికి తెలుగు హీరోలు ఆసక్తి చూపించేవారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రవితేజ లాంటి ఎంతో మంది స్టార్ హీరోలు అన్ని రీమేక్ చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ విషయంపై స్పందించిన అభిమానులు రీమేక్ సినిమాలు వద్దు అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ వైరల్ చేస్తున్నారు. #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో వైరల్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తర్వాత తేరి చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయకూడదు అని స్ట్రైట్ సినిమాలతో రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
అంతేకాదు స్ట్రైట్ సబ్జెక్టుతో రావాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కూడా అభిమానులు దర్శకులకు సూచిస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు రీమేక్ సినిమాలలో చేయడం పవన్ కళ్యాణ్ మానేస్తాడా లేక తన తదుపరిచిత్రాలలో రీమేక్లతోనే కొనసాగిస్తాడా అనేది చూడాలి.  ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తూ మరొకవైపు రాజకీయాలలో కూడా మరిన్ని పావులు కదుపుతున్నాడు. మరి అటు సినిమా పరిశ్రమ ఇటు రాజకీయమా అనేది మరికొద్ది రోజులు ఆగితే తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: