నాని అభిమానులను భయపెడుతున్న హిట్ 3 మ్యానియా !

Seetha Sailaja
వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నాని కి ఒక బ్లాక్ బష్టర్ హిట్ కావాలి. ఆకోరిక వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ‘దసరా’ తీరుస్తుందని నాని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈపరిస్థితుల మధ్య ఎవరు ఊహించని విధంగా నాని ‘హిట్ 2’ మూవీతో నిర్మాతగా సూపర్ సక్సస్ అయ్యాడు. ఈమూవీ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడ మంచి టాక్ తెచ్చుకావడంతో ఈమూవీ కేవలం మూడురోజులలో బ్రేక్ ఈవెన్ కు వచ్చి లాభాల బాట పట్టింది అన్నవార్తలు వచ్చాయి.

ఈవారం విడుదల అవుతున్న 18 చిన్న సినిమాలలో ఏచిన్న సినిమా పైనా అంచనాలు లేకపోవడంతో ఈవీకెండ్ కూడ ‘హిట్ 2’ హడావిడి కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. వచ్చేవారం విడుదల అయ్యే ‘అవతార్ 2’ వరకు మరే సినిమా లేకపోవడంతో సినిమా చూడాలి అనే ప్రేక్షకులకు ‘హిట్ 2’ తప్ప మార్గం లేదు. ఈపరిస్థితుల మధ్య ఈమూవీని ప్రమోట్ చేస్తూ దర్శకుడు శైలేష్ ‘హిట్ 3’ గురించి అంచనాలు పెంచుతూ నాని నటించబోతున్న అర్జున్ సర్కార్ పాత్ర గురించి విపరీతంగా చెపుతున్నాడు.

ఇప్పుడు ఈవిషయమే నాని అభిమానులను భయపెడుతున్నట్లు టాక్. వాస్తవానికి ‘హిట్ 3’ స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు. అసలు ఆసినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అయితే దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్ 3’ గురించి మాట్లాడుతూ ‘‘చంపేద్దాం బ్రో’’ అంటూ విపరీతంగా అంచనాలు పెంచుతున్నాడు. అంతేకాదు ఈదర్శకుడు ‘‘నా మాటలు గుర్తు పెట్టుకోండి. ‘హిట్-3’లో అర్జున్ సర్కార్‌తో నెక్స్ట్ లెవెల్ రాంపేజ్ క్రియేట్ చేయబోతున్నా’’ అంటూ నాని అభిమానులకు జోష్ ను ఇస్తున్నాడు.

అయితే ఇంత విపరీతమైన అంచనాలను పెంచితే ‘హిట్ 3’ కథలో ఏమాత్రం తేడా వచ్చినా అసలకు మోసం వస్తుందని నాని అభిమానుల భయం. ఇప్పటికే ‘దసరా’ రిజల్ట్ గురించి నాని అభిమానులలో భయం ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ‘హిట్ 3’ గురించి ఇంత హైక్  ఎందుకు అంటూ అభిమానులు తెగ మధన పడుతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: