"ధమాకా" మూవీ నుండి "దండ కడియాలు" సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వరుస అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న రవితేజ పోయిన సంవత్సరం విడుదల అయిన క్రాక్ మూవీ తో సూపర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అలా క్రాక్ మూవీ తో మంచి ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఆ తర్వాత ఖిలాడి , రామారావు అన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. కాకపోతే ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "ధమాకా" అనే మూవీ లో హీరో గా నటించాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తేరకెక్కిన ఈ మూవీ లో శ్రీ లీల , రవితేజ సరసన హీరోయిన్ గా నటించగా , భీమ్స్ సిసిరోలియో ఈ మూవీ కి సంగీతం అందించాడు.
 

ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి దండ కడియాలు అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ సూపర్ మాస్ బీట్ తో ఉండడంతో ఈ సాంగ్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులకు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: