పాత వివాదాన్ని మళ్ళీ నిద్ర లేపిన అనసూయ..!!

murali krishna
 బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాత లు సంపాదించుకున్న  యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాల కు దూరమై వరుస సినిమా అవకాశాలతో  చాలా బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాల తో ఎంతో బిజీగా గడుపుతున్న యాంకర్ అనసూయ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయా ల ను సోషల్ మీడియా  లో వేదికగా అభిమానులతో పంచుకుంటారు ఈ బ్యూటీ. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా అనసూయ చేసే కొన్ని పోస్టుల వల్ల పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు.
ఈ క్రమం లోనే గతంలో ఆంటీ అనే వివాదం ఎంతటి పరిణామాలకు దారితీసిందో మనకు  బాగా తెలిసిన విషయమే అని చెప్పొచ్చు. ఏకంగా ఈ విషయంపై అనసూయ పోలీసుల ను ఆశ్రయించి కేసు కూడా పెట్టారు. అయితే ఈ విషయం అందరూ మర్చిపోయినప్పటికీ తాజాగా ఈమె అభిమానుల తో  ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ ఆ కేసు ఏమైంది అనసూయ గారు అంటూ  ఇలా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ మరోసారి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.
అరెస్టులు మొదలయ్యాయి కదా ఇది కొందరి ఫ్యూచర్ కి సంబంధించిన విషయం కనుక విచారణ జరిపిన అనంతరమే అరెస్టు చేస్తున్నారు. మెల్లిగా ప్రాసెస్ జరుగుతుంది అని అనసూయ వివరించారు,మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారిని చూస్తే ఎంతో గర్వం గా ఉంటుంది. ఇలా చేసేవారికి నేను చొప్పదల్చుకున్నది ఒక్కటే.ఎదుటివారిని కించపరచడం అగౌరవపరచడం చాలా తప్పు ఇది చట్టరీత్యా నేరం ఇన్ని రోజులు చాలా ఓపిక పట్టాను.. ఇకపై యాక్షన్ తీసుకోవడమే అంటూ మరోసారి అనసూయ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు. ప్రస్తుతం అనసూయ చేసినటువంటి ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: