ఆ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతున్న "నారప్ప" సినిమా... అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ కొంత కాలం క్రితం నారప్ప అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ అయినటువంటి అసురన్ మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. తమిళ అసురన్ మూవీ లో ధనుష్ హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే తమిళ్లో సూపర్ హిట్ అయినటువంటి ఆసురన్ మూవీ ని తెలుగు లో నారప్ప పేరుతో రీమిక్ చేశారు.
 

నారప్ప మూవీ కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ కి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇలా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన నారప్ప మూవీ ని మళ్లీ థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని డిసెంబర్ 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. కాకపోతే డిసెంబర్ 13వ తేదీన మాత్రమే ఈ సినిమాను ధియేటర్ లలో ప్రదర్శించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: