ఆ సమస్యతో బాధపడుతూనే రాజమౌళి "ఆర్ఆర్ఆర్" మూవీ ని తీశాడు... శ్రేయ..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రేయ కొన్ని సంవత్సరాలు క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో మూవీ లలో హీరోయిన్ గా నటించి , ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ కూడా శ్రేయ అప్పుడప్పుడు తెలుగు సినిమా లో నటిస్తూ , తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఇది ఇలా ఉంటే శ్రేయ కొన్ని సంవత్సరాల క్రితం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన చత్రపతి మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం , అలాగే ఈ మూవీ లోని శ్రేయ నటన కు కూడా ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రేయ , ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. శ్రేయ ఈ మూవీ లో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించినప్పటికీ ఈ పాత్ర ద్వారా శ్రేయ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రేయ "ఆర్ ఆర్ ఆర్" మూవీ చిత్రీకరణ సమయంలో ఎస్ ఎస్ రాజమౌళి అనారోగ్యంగా చాలా ఇబ్బందులు పడ్డాడు అని వెల్లడించింది. శ్రేయ తనకు తెలిసినంత వరకు రాజమౌళి ఆస్తమాతో ఇబ్బందు పడుతూనే ఆర్ ఆర్ ఆర్ మూవీ ని తెరకెక్కించారు అని చెప్పింది. సెట్ మొత్తం దుమ్ముతో నిండిపోయి ఉన్నప్పటికీ రాజమౌళి ధ్యాస మొత్తం సినిమా పైనే ఉండేది అని శ్రేయ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: