తెలుగులో నాకు ఫాన్స్ తగ్గిపోయారు... రకుల్ ప్రీత్ సింగ్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరో ల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా హిందీ సినిమా లలో నటించడానికి చాలా ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ కొన్ని హిందీ మూవీ లలో కూడా నటించింది.

కాకపోతే ఈ ముద్దు గుమ్మ నటించిన హిందీ మూవీ లు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను మాత్రం అందుకోలేదు. అయినప్పటికీ ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తనకు తెలుగు పరిశ్రమలో అభిమానులు తగ్గిపోతున్నారు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లినప్పటి నుంచి తనకు తెలుగు , తమిళ పరిశ్రమలో అభిమానులు తగ్గిపోయారని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. టైమ్ లేకపోవడం వల్లనే సౌత్ ఇండియా మూవీ లలో నటించలేక పోతున్నానని చెప్పింది.  మున్ముందు సౌత్ లో సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తానని ఈ ముద్దు గుమ్మ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: