ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది.ఇక ప్రస్తుతం ఎక్కడ చూసిన బన్నీ హవానే కనిపిస్తుంది. అయితే సౌత్, నార్త్ అని తేడాలేకుండా ప్రతి చోట అల్లుఅర్జున్ పేరు మార్మోగిపోతుంది.ఇక అవార్డు ఫంక్షన్ ఏదైనా సరే అందులో బన్నీ పేరు కచ్చితంగా వినబడుతుంది. గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.అయితే ముఖ్యంగా దక్షిణాదిన బన్నీకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కాగా పుష్ప రాజ్‌గా బన్నీ నటనకు ప్రేక్షకులు థియేటర్‌లకు బ్రహ్మరథం పట్టారు.
ఇకపోతే ఈ సినిమాలో అల్లుఅర్జున్ నటనకు ఇప్పటికే పలు ఉన్నత అవార్డులు రాగా.. ఇప్పుడు బన్నీ మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు.ఇదిలావుంటే తాజాగా అల్లుఅర్జున్ ప్రతిష్టత్మక GQ MOTY-2022 ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఈ అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు హీరో బన్నీ కావడం విశేషం.అయితే ఈ అవార్డు రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు పొందిన తొలి దక్షిణాది హీరోగా అరుదైన ఘనత సాధించాడు.
ఇకపోతే పుష్ప రాజ్‌గా బన్నీ నటనకు ఫిలింఫేర్, సైమా వంటి అత్యున్నత అవార్డులు వచ్చాయి.ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప చిత్రానికి క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. అయితే భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది.అంతేకాదు ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. కాగా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.అయితే ప్రస్తుతం సినీ ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు..!!