అనిరుధ్ విజయ్ దేవరకొండ కాదని తప్పు చేశాడా!!

P.Nishanth Kumar
సౌత్ లో అగ్ర సంగీత దర్శకుడిగా ఉన్న అనిరుధ్ తో సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలుగా ఉన్న చాలామంది హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి వేచి చూస్తున్నారు.  ఇప్పటికే తెలుగులో ఆయన పలు సినిమాల ద్వారా తన అభిమానులను ఆలచించగా ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు అందులో ఎన్టీఆర్ సినిమా కూడా ఉండడం విశేషం. 

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు సంగీత దర్శకుడుగా అనిరుద్ ఎంపిక అయ్యాడు ఈ విషయాన్ని చిత్ర బృందం ఇదివరకే అధికారికంగా ప్రకటన కూడా చేసింది అయితే ఈ సినిమా ఎంతకీ మొదలు కాకపోవడం ఈ సినిమాను ఒప్పుకోవడం తో తప్పు చేశాడు అని కొంతమంది ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా కథ విషయంలో చాలా మార్పులు జరగడంతో కొత్త కథను తయారు చేస్తున్న కొరటాల శివ ఈ చిత్రాన్ని మొదలుపెట్టడానికి మరికొన్ని రోజుల సమయం కూడా పట్టేలా ఉంది. 

ఆ విధంగా గతంలో ఆయన వదిలేసిన ఓ సినిమా చేసి ఉంటే బాగుండేది అని ఇప్పుడు అనిరుధ్ బాధపడుతున్నాడట. అనిరుధ్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి ఆ మధ్య సిద్ధమయ్యాడు. కానీ సడన్ గా ఆ సినిమాకు సంబంధించిన సంగీత దర్శకుడుని మార్చి కొత్త సంగీత దర్శకుడిని ఎంపిక చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాకు అనిరుద్ మొదటి సంగీత దర్శకుడుగా ఎంపిక కాక చివరి నిమిషంలో ఆయనను తీసేసి ఇంకొక సంఘటన దర్శకుడుని పెట్టుకున్నారు. కారణమేంటో తెలియదు కానీ అనిరుధ్ ఈ సినిమా చేయకపోవడం కొంతమంది అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ఎన్టీఆర్ సినిమా బదులు ఈ సినిమా చేస్తే బాగుండేది అని అనిరుధ్ అభిమానులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: