ఎన్టీఆర్ 30 వ మూవీలో ఆ ముద్దుగుమ్మ ఫైనల్ అయినట్టేనా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ టాలంటెడ్ దర్శకులలో ఒకరు అయినటు వంటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర బృందం చేసింది.

అలాగే ఈ మూవీ యూనిట్  ఒక మోషన్ పోస్టర్ నీ కూడా విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ ని  తొమ్మిది భాషలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి రత్న వేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనుండగా ,  అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ లో సరికొత్త లుక్ లో కనబడడం కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలం అవుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ 30 వ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రష్మిక మందన లేదా కీర్తి సురేష్ లలో ఒకరిని మూవీ యూనిట్ ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ 30 వ మూవీ యూనిట్ రష్మిక మందన ను హీరోయిన్ గా తీసుకోవడానికి దాదాపు ఫిక్స్ అయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే రష్మిక మందన మరో క్రేజీ సినిమా అవకాశాన్ని దక్కించుకున్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: