బ్రహ్మాస్త్ర ఓటీటి రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

Divya
బాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలాకాలం తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి. అలా బ్రహ్మాస్త్ర సినిమాతో కాస్త నిర్మాతలకు ఊపిరి పీల్చిందని చెప్పవచ్చు.. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ ఈ సినిమాలు అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే బాయికాట్ అనే పదం ఎక్కువగా వినిపించింది. అయితే మొదటి వారం ఈ సినిమా మిశ్రమ స్పందన లభించింది. రెండో వారం నుంచి ఈ సినిమా మెల్లమెల్లగా ఉంచుకుంది రెండు వారాలలోని ఈ సినిమా రూ. 400 కోట్ల రూపాయలు క్లబ్లో చేరినట్లుగా సమాచారం.

ఇక ఇప్పటికే ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ ఉన్నది ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటి లో విడుదలవుతుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా అప్డేట్ కూడా వైరల్ గా మారుతోంది. ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ రెండో వారంలో ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమ్మింగ్ కానున్నట్లు సమాచారం. ఈ మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నది.

అయితే ఈ సినిమా ఓటీటి రిలీజ్ పై ఇంకా ఇలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. ప్రస్తుతం రణబీర్ కపూర్ యానియల్ అనే సినిమాలో నటిస్తున్నారు ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నది అలాగే త్వరలో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కు సంబంధించి షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ఇక ఈ తాజా అప్డేట్ ప్రకారం పార్ట్-2  లో కూడా హృతిక్ రోషన్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఓటిటి విషయంలో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: