బాలయ్య సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!

Divya
నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ కూడా నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా టైటిల్ ని మాత్రం డైరెక్టర్ గోపీచంద్ మన లేని రిలీవ్ చేయకుండా బాలయ్య అభిమానులను కాస్త నిరుత్సాహ పరుస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా గ్లింప్స్, టీజర్ పోస్టర్లు ఈ సినిమాకు మంచి హైప్ ను పెంచాయి. కానీ ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం డైరెక్టర్ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక బాలయ్య అభిమానులు కూడా ఒకానొక సమయంలో ఈ సహనాన్ని కోల్పోయారు. దీంతో సోషల్ మీడియా ద్వారా డైరెక్టర్ కు పలు సందర్భాలలో విమర్శించడం కూడా జరిగింది సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ గోపీచంద్ అని ఆ సమయం రానే వచ్చిందని టైటిల్ అనౌన్స్మెంట్ కు సిద్ధమవుతున్నారు దసరా సందర్భంగా NBK -107 వ సినిమాకు సంబంధించి టైటిల్ ని ప్రకటించబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రం విడుదల తేదీని కూడా ఆరోజు ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ 2 లేదా 5వ తేదీన ఈ సినిమా టైటిల్ విడుదల చేసి అవకాశం ఉన్నది. ఈ విషయం చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్నట్లు తెలుస్తోంది.ఇక పూర్తి వివరాలపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ లేదా డిసెంబర్ నెల విడుదల చేసి అవకాశాలు ఉన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు ఇక గత సంవత్సరం డిసెంబర్ నెలలో అఖండ సినిమా విడుదల చేసి మంచి విజయాన్ని అందించుకోవడంతో బాలకృష్ణకు ఆ సెంటిమెంట్ కలిసి వచ్చిందని అందుచేతన సినిమాను అప్పుడే విడిచే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: