అయ్యో!మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న రష్మిక...!

murali krishna
నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న రష్మిక వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే.


గతేడాది పుష్ప ది రైజ్ సినిమా తో రష్మిక కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. డీ గ్లామరస్ రోల్ లో నటించినా రష్మిక తన నటనతో మెప్పించారు. పుష్ప సినిమాలోని సాంగ్స్ లో రష్మిక వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సామీ సామీ సాంగ్ లో రష్మిక వేసిన స్టెప్పులు నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా రష్మిక ప్రముఖ డాక్టర్లలో ఒకరైన గురువారెడ్డి గారిని కలిశారట. రష్మిక ఈ డాక్టర్ ను కలవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అయితే రష్మిక మోకాళ్ల నొప్పులతో బాధ పడుతుండటం వల్లే తన ను కలిసినట్టు గురువారెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం విశేషం. సామి సామి అంటూ మోకాళ్ల మీద బరువంతా వేసి డ్యాన్స్ చేయడం వల్లే నొప్పులు వచ్చాయని రష్మికకు చెప్పానని గురువారెడ్డి తన పోస్ట్ లో పేర్కొన్నారు. పుష్ప సినిమా చూసిన తర్వాత రష్మికను అభినందించాలని అనుకున్నానని ఆమె మోకాలి నొప్పి వల్ల ఆమెను అభినందించడం సాధ్యమైంద ని గురువారెడ్డి అన్నారు. బన్నీ కూడా త్వరలో భుజం నొప్పితో తన దగ్గరకు వస్తాడేమో అంటూ డాక్టర్ సెటైర్ వేయడం గమనార్హం.   ఫోటోలో రష్మిక నవ్వుతూ చాలా అందంగా కనిపించారు. చిన్న వయస్సులో నే రష్మికకు మోకాలి నొప్పులు రావడంతో పాపం అంటూ కొంతమంది నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. యాక్టర్ కు అయినా డాక్టర్ తో అవసరం తప్పదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా సినిమా కు రష్మికకు క్రేజ్ పెరుగుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: