స్వల్ప ఓట్ల తేడాతో ఎలిమినేట్ అవబోతున్న ఆ కంటెస్ట్....!!

murali krishna
తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న ఏకైక రియాలిటీ షో ఇదే..ఇప్పటి వరుకు 5 సీసన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీసన్ లోకి అడుగుపెట్టి రెండు వారాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మూడవ వారం లోకి అడుగుపెట్టింది..అయితే గడిచిన సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ కి ప్రేక్షాదరణ కాస్త తక్కువే..రేటింగ్స్ మొదటి ఎపిసోడ్ నుండే సరిగా రాలేదు..నాగార్జున గారికి బిగ్ బాస్ టీం ఈ విషయం చెప్పడం తో గత వారం శనివారం రోజు ప్రసారమైన ఎపిసోడ్ లో నాగార్జున గారు హౌస్ మేట్స్ పై చాలా తీవ్రంగా ఫైర్ అయ్యాడు..ఆడడం ఇష్టం లేకపోతే బట్టలు సర్దుకొని వెళ్లిపోండి బయటకి అంటూ కోపం చూపాడు..ఇప్పటి వరుకు నాగార్జున గారు 5 సీసన్స్ కి వ్యాక్యతగా వ్యవహరించాడు..కానీ ఒక్క సీసన్ లో కూడా ఈ రేంజ్ లో ఆయన ఎప్పుడు హుక్స్ మేట్స్ పై ఫైర్ అవ్వలేదు..కానీ మొట్టమొదటిసారి ఆయన అలా హౌస్ మేట్స్ పై ఫైర్ అవ్వడం చూసి ప్రతి ఒక్కరు షాక్ కి గురైయ్యారు.
నాగార్జున గారు పీకిన క్లాస్ హౌస్ మేట్స్ పై గట్టిగానే పని చేసింది..ఈ వారం టాస్కులలో ప్రతి ఒక్కరు గట్టిగా ఆడదానికే ప్రయత్నం చేసారు..అయితే ఈ వారం నామినేషన్స్ లో ఏకంగా 10 మంది ఇంటి సభ్యులు నామినెటే అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఆరోహి ,నేహా , బాలాదిత్య, చంటి ,గీతూ , ఇనాయ, సుదీప , రేవంత్, శ్రీహాన్ మరియు వాసంతి వంటి వారు ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు.
వీరిలో అందరికంటే అత్యధిక ఓట్లతో రేవంత్ టాప్ స్థానం లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది..ఆయన తర్వాత రెండవ స్థానం లో శ్రీహాన్ మరియు మూడవ స్థానం లో గీతూ కొనసాగుతున్నారు..అయితే మొదటి వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన ఇనాయ సుల్తానా..తనకి వచ్చిన అద్భుతమైన అవకాశం ని ఉపయోగించుకొని డేంజర్ జోన్ నుండి బయట పడింది..ఈ వారం వచ్చిన వోటింగ్ ప్రకారం సుదీప కానీ, నేహా కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుదీప గారే ఎలిమినేట్ అవ్వబోతున్నారని తెలుస్తుంది..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే ఆదివారం వరుకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: