బాలీవుడ్: ఈ రెండు కూడా అస్సామేనా?

Purushottham Vinay
ఇంకో రెండు రోజుల్లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ అనేది జరగనుంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ఇంకా అలాగే అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సినిమాలు నువ్వా నేనా అని ఢీ కొనబోతున్నాయి.అయితే అనూహ్యంగా రెండింటి మీద కూడా ఆశించిన స్థాయిలో బజ్ అనేది లేకపోవడం ట్రేడ్ ని కలవరపెడుతోంది. లాల్ సింగ్ నిన్నటి దాకా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కేవలం 25 వేల టికెట్లు అమ్మితే రక్షా బంధన్ సినిమా దానిలో సగం కనీసం 15 వేలను దాటలేకపోయింది. ఈ రోజు రేపు టైం ఉంది కాబట్టి ఈ నెంబర్స్ లో మార్పులు అనేవి ఉంటాయి కానీ మొత్తంగా చూసుకుంటే ఆయా హీరోల రేంజ్ కు తగ్గట్టు జనం ఎగబడి టికెట్లు కొనడం లేదని పూర్తిగా అర్థమైపోయింది. టాక్ కూడా రివ్యూస్ చూశాకే వెళ్లాలని జనాలు డిసైడ్ అవుతున్నారు.రెండూ కూడా కలిపి మొదటి రోజు 30 కోట్లు వసూలు చేసినా గొప్పే అనేలా ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్ల ముందస్తు అంచనాలు. నిజానికి కెజిఎఫ్ 2 ఇంకా ఆర్ఆర్ఆర్ కన్నా చాలా తక్కువ. ఒకవేళ దేనికైనా బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్ కనుక వస్తే థియేటర్లలో పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదూ అటు ఇటు అయ్యిందంటే మాత్రం మళ్ళీ నిరాశ తప్పదు. ఇక హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ రీమేక్ గా రూపొందిన లాల్ సింగ్ చడ్డాని హిందీలో కంటే ఎక్కువ అమీర్ తెలుగులోనే ప్రమోట్ చేస్తున్నాడు.


మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు పబ్లిసిటీ పనుల్లో భాగమవ్వడం ఇంకా ప్రీమియర్లు వేయిస్తే అక్కడికీ వెళ్లడం లాంటివన్నీ చూసుకుంటున్నారు. మరి ఇది ఏ మేరకు హెల్ప్ అవుతుందో అనేది చూడాలి.ఇక ఫుల్ సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన రక్షా బంధన్ లో అయితే చెల్లెళ్ళకు పెళ్లిళ్లు చేయడమే జీవిత లక్ష్యంగా మారిన ఓ మిఠాయి వ్యాపారి కథగా దీన్ని రూపొందించారు. నిడివి కేవలం 1 గంట 50 నిమిషాలకే పరిమితం చేయడం లెన్త్ పరంగా అడ్వాంటేజ్ అయ్యేలా కూడా ఉంది. కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా హెవీ ఎమోషన్లను ఆధారంగా చేసుకున్నావే. మాస్ కోరుకునే మసాలాలు ఇందులో మచ్చుకు కూడా ఉండవు. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో అయితే ఇవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.రెండింటి మీద సుమారు రెండు వందల యాభై కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ కూడా ఆధారపడి ఉంది. భూల్ భులయ్య 2 తర్వాత హిట్టు లేక కొట్టుమిట్టాడుతున్న నార్త్ కి ఇవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: