కళ్యాణ్ రామ్ డెవిల్ కి డోకా లేనట్లేనా!!

P.Nishanth Kumar
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా చేసిన పీరియాడిక్ సినిమా బింబి సారా తో ప్రేక్షకులను అలరించి సంచలన విజయాన్ని అందుకున్నాడు. బింబి సారా అనే ఒక మహారాజు కథ తో టైం ట్రావెలింగ్ కథ తో వచ్చిన అయన ఆ సినిమా ద్వారా నందమూరి అభిమానుల ఆకలిని తీర్చాడు. పటాస్ తర్వాత అంతటి స్థాయి లో విజయాన్ని అందుకోలేకపోయిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఈ సినిమా తో ఇంతటి గొప్ప విజయాన్ని అందుకోవడం విశేషం. ఇటీవలే కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. ప్రేక్షకులు కూడా రెగ్యూలర్ సినిమా లను చూసి బోర్ కొట్టిన నేపథ్యంలో ఎంతో వెరైటీ గా రూపొందిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవగలిగింది.
గతంలో కళ్యాణ్ రామ్ ఇలాంటి కథను సినిమాగా చేయకపోవడం వంటివి ఈ సినిమా   ఇంతటి స్థాయి లో హిట్ అవడానికి గల ముఖ్య కారణం. మొదటినుంచి కళ్యాణ్ రామ్ వైవిధ్యత కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఓ వైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మరోవైపు రెగ్యులర్ మాస్ మసాలా ఎంటర్టైనర్లలో నటించాడు. అలా ఇప్పుడు బింబి సారా చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దర్శకుడిగా వశిష్ట తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నాడని చెప్పాలి. అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ సినిమా ను ఎంతో బాగా తెరకెక్కించి సినిమా ఇంత పెద్ద హిట్ అవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
అలా ఈ సినిమా ఇటు హీరో కి అటు దర్శకుడికి ఇద్దరికీ మంచి విజయాన్ని తెచ్చిపెట్టగా ఇప్పుడు వీరు చేయబోయే తదుపరి సినిమాలపై మంచి అంచనాలు పెరిగిపోయాయి. కళ్యాణ్ రామ్ ఈ సినిమా తర్వాత డెవిల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈనేపథ్యంలో ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పొచ్చు. ఈ సినిమా ను వచ్చే ఏడాది విడుదల చేయాలనీ ప్లాన్ చేశాడు కళ్యాణ్ రామ్. ఆ సినిమా కూడా రెగ్యులర్ సినిమా కాకపోవడం విశేషం. వెరైటీ ఖాతాలున్న సినిమాలు చేస్తూ ఈ హీరో ముందు ముందు ఇంకెలాంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: