శంకర్ ఒక్కడు లాగే.. పూరీ జనగణమన!!

P.Nishanth Kumar
దర్శకుడు శంకర్ రూపొందించిన ఒక్కడు సినిమా ఎంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చేరింది. వారు కోరుకున్న అన్ని అంశాలు కూడా ఈ చిత్రంలో ఉన్న కారణంగానే దాన్ని అంత పెద్ద హిట్ చేశారు ప్రేక్షకులు. అలా ఆ తర్వాత అలాంటి కాన్సెప్ట్ తో ఏ సినిమాను కూడా ఎవరూ కూడా చేయలేదు అనే చెప్పాలి. దర్శకులందరూ ఇటీవల కాలంలో మాస్ సినిమాలు చేయడానికి ఎక్కువగా అలవాటు పడిపోయిన నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక వినూత్నమైన సినిమాను చేయడానికి శ్రీకారం చుట్టారు.

అది కూడా ఒక్కడు సినిమా లాంటి కాన్సెప్ట్ కావడం అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. జనగణమన అనే ఒక సినిమాను చేయాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడు పూరీ జగన్నాథ్. ఇండస్ట్రీలో 25 కు పైగా సినిమాలు చేసి మంచి సక్సెస్ రేట్ కలిగి ఉన్న ఈ దర్శకుడు ఇప్పుడు లైగర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే హీరోతో కలిసి మరొక సినిమాను చేయడానికి ఇప్పటికే రంగం కూడా సిద్ధం చేశాడు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన లైన్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

దేశంలో రాజకీయ వ్యవస్థ పరిపాలనలో విఫలమైన వేల ఆర్మీ వ్యవస్థ పరిపాలన కొనసాగిస్తే ఏవిధంగా పరిస్థితులు ఉంటాయి హీరో ఏ విధమైన పనులను చేశాడు అనేది ఈ సినిమా యొక్క కథ అని తెలుస్తుంది. మరి ఆగస్టు మూడవ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. మరి ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కాంబో భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఈ చిత్రం కనుక మంచి విజయం సాధిస్తే జనగణమన సినిమాపై కూడా అన్ని అంచనాలు భారీగా పెరిగిపోతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

JGM

సంబంధిత వార్తలు: