అఖిల్ కి పెద్ద సమస్య వచ్చి పడిందే!!

P.Nishanth Kumar
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శెరవేగంగా జరుపుకుంటున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం అందించిన ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంట్టైనర్ గా రూపొందగా దీనికి సంబంధించిన విడుదల తేదీ పట్ల చిత్ర బృందం మల్లా గుల్లాలు పడుతుంది. ముందుగా ఈ సినిమాను ఆగస్టులోనే విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం యొక్క షూటింగ్ ఆగిపోవడంతో దీనికి సంబంధించిన విడుదల ఆలస్యం అయ్యిందని చెప్పవచ్చు.

ఆర్థిక కారణాల వల్ల ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదట్లో కొన్ని రోజులు ఆగిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్వయంగా ఈ చిత్రానికి ఫైనాన్షియర్ గా వ్యవహరించడంతో ఈ సినిమా మళ్లీ మొదలయ్యింది అని చెప్పవచ్చు. అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ సినిమా ఈ విధంగా అయిపోవడం ఆయన అభిమానులను ఎంతగానో కలచివేసింది. ఫైనల్ గా ఈ చిత్రం పోటీలో ఉండడం అందరిని ఎంతగానో సంతోష పెడుతుంది. 

ఏదేమైనా వరుస ఫ్లాప్ ల నుంచి నుంచి కొంత తేరుకుని ఇప్పుడిప్పుడే విజయాల బాట పడుతున్న అఖిల్ ఈ ఐదవ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ విడుదల కాగా దానికి మంచి గుర్తింపు వచ్చింది. సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని భావించిన చిత్ర బృందానికి కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఆ నెలలో కొన్ని వేరే క్రేజీ సినిమాలు విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం కాగా ఈ విధంగా ఏజెంట్ సినిమా ఎలా విడుదల అవుతుంది అనేది చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ రానుంది. కుదిరితే డిసెంబర్లో లేదంటే అక్టోబర్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా సురేందర్ రెడ్డి ప్లాన్స్ చేస్తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: