ఎన్టిఆర్ పై కూడా వత్తిడి పెరుగుతుందా!!

P.Nishanth Kumar
ఎన్టీఆర్ హీరోగా రూపొందవలసిన చిత్రం అంతకంతకు ఆలస్యం అవుతూ ఉండడం ఆయనపై ఎంతో ఒత్తిడిని తీసుకువస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి సినిమాను చేయవలసిన ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని ఇంకా మొదలు పెట్టకపోవడం ఎంతో నిరాశాజనకమైన విషయం. కారణం ఏదైనా కూడా ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద హీరో తన సినిమాను మొదలు పెట్టడానికి ఇంతటి సమయాన్ని తీసుకోవడం నిజంగా దురదృష్టకరమైన విషయం అని చెప్పాలి.

చేతిలో పలు సినిమాలు ఉన్నప్పటికీ వాటిని మొదలు పెట్టకుండా ఆలస్యం చేస్తూ ఉండడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. ఆ విధంగా ఎన్టీఆర్ తన సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడా అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన అభిమానులు. మొన్నటిదాకా ఆచార్య సినిమా ఇబ్బందులలో ఉన్న కొరటాల శివ ఎందుకు ఇంకా ఈ సినిమాను మొదలు పెట్టలేకపోతున్నాడు అన్న అనుమానాలను కలిగిస్తుంది. ఒకవైపు ఆయన భారీ ఫ్లాప్ ఎదుర్కొన్నాడన్న సందేహాలు నెలకొంటూ ఉన్నాయి. 

ఈ సమయంలో కొరటాల శివతో సినిమా చేయడం అవసరమా అని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్న నేపథ్యంలో ఈ చిత్రంను ఆలస్యం చేయడం ఆయనకు ఏమాత్రం మంచిది కాదని వారు చెబుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా బయటకు చిత్ర బృందం చెబుతుంది. మరి ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులను కొరటాల శివ చేసిన దాఖలాలు అయితే లేవు. మరి ఎందుకు ఈ సినిమా ఇంకా మొదలు పెట్టకుండా ఆపుతున్నారు అన్న విషయం తెలియవలసి ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో కథానాయకగా ఎంచుకోవాలని భావిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ కాకుండా అనిరుద్ ను ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా కొరటాల శివ ఎంచుకోవడం విశేషం. మరి వీరి కాంబో లోని ఆల్బమ్ ఏ స్థాయి లో ఉంటుందో మరీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: