మహేష్ గొప్పతనాన్ని చాటి చెప్పిన చిరు, పవన్!

Purushottham Vinay
ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజుతో 47 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారు.ఇంకా అలాగే ఎక్కడికక్కడ 'పోకిరి' 'ఒక్కడు' వంటి సూపర్ హిట్ చిత్రాలు స్పెషల్ షో లు వేస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ అవి యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్స్లో అందుబాటులో ఉన్న సినిమాలే అయినప్పటికీ ఓ రిలీజ్ సినిమాకి జరిగినట్లు ఆ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం కూడా ఇప్పుడు అందరం చూశాం.ఇది నిజంగా సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ కి నిదర్శనం.ఇలా ఈ సినిమాల ద్వారా వచ్చిన కలెక్షన్లు మొత్తం కూడా చారిటీకి ఇవ్వబోతున్నట్లు కూడా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఇంకా అలాగే మహేష్ టీం తెలిపింది. అందరూ కూడా ఈ విషయంలో మహేష్ ని ఇంకా అలాగే ఆయన ఫ్యాన్స్ ని ఎంతగానో మేచ్చుకుంటున్నారు.


సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో పెద్ద ఎత్తున మహేష్ బాబు బర్త్ డే ట్యాగ్స్ అనేవి తెగ ట్రెండ్ అవుతున్నాయి. సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున సూపర్ స్టార్ మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగా హీరోస్ మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మహేష్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఒట్టి శుభాకాంక్షలు మాత్రమే కాదు మహేష్ బాబు సేవా గుణాన్ని గొప్ప తనాన్ని చాటి చెబుతూ.. చిరు, పవన్ మహేష్ బాబుని పొగడ్తలతో ముంచెత్తుతూ ఆయనకు విషెస్ తెలిపారు. మహేష్ కి చిరంజీవి, పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పడం ఫ్యాన్స్ కి చాలా ఆనందంగా వుంది. ప్రస్తుతం వీరు చేసిన ట్వీట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ పోస్ట్ లు మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: